Rasaleela Vela Song Lyrics |
#Telugu-LyricsMovie:
#Aadhithya369Lyrics: Vennela Kanti
Singers:
#S.P.B,
#JanakiRaasaleela vela rayabaramela
Maate mounamai maayajeyanela
{2}
Kougilinta vedilo karige vanne vennala
Tellaboyi vesavi challe pagati vennala
Mojulanni padaga jaji poola javali
Kandenemo kougita andamaina jaabili
Thene vaanalona chilike teeyanaina snehamu
Meni veena lona palike soyagaala ragamu
Nidurarani kudhuruleni edalaloni sodalu mani
{Raasaleela vela...}
Maayajesi dayaku soyagaala mallelu
Moyaleni teeyani hayi poola jallulu
Cheradeesi penchaku bharamaina yavvanam
Dora siggu tunchaku oorukodu eekshanam
Chepakalla sagarana alala ooyaloogana
Choopu mulla opalenu kalala talupu teeyana
Chaluva soku kaluva reku kaluva soki niluvaneedu
{Raasaleela vela...}
రాసలీల Telugu Lyrics
రాసలీల వేళ రాయబారమేల
మాటే .. మౌనమై మాయజేయనేల
{ రాసలీల వేళ }
కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నలా
మోజులన్ని పాడగా జాజి పూల జావళి
కందెనేమొ కౌగిట అందమైన జాబిలి
తేనె వానలోన చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలు మాని
{ రాసలీల వేళ }
మాయజేసి దాయకు .. సోయగాల మల్లెలు
మోయలేని తీయనీ .. హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దొర సిగ్గు తుంచకు ఊరుకోదు ఈక్షణం
చేపకళ్ళ సాగరాన అలల ఊయలూగనా
చూపు ముళ్ళ ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు
{రాసలీల వేళ }
#రాసలీల #రా #Telugu-Movies-Song-Lyric #Rasaleela #Telugu-Lyrics #Latest-Telugu-Lyrics #Lyrics-in-Telugu